జీహెచ్ఎంసీ మేయర్‌గా బంజారాహిల్స్ కార్పొరేటర్ కె. కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు.
డిప్యూటీ మేయర్ పదవులను మహిళలకు ఇవ్వడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.అందుకు ఆమె, కేసీఆర్, కేటీఆర్ లకు మరోసారి ధన్యవాదాలు చెప్పారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ అవినీతి జరిగితే సహించనని, అవినీతిపై ఎంతదాకా అయినా వెళ్లి పోరాడుతానని స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు పాటుపడతానన్నారు. నగరాభివృద్ధికి అందరి సలహాలూ తీసుకుంటానని చెప్పారు.
మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తానని చెప్పారు. అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారు.గురువారం మేయర్, డిప్యూటీ మేయర్ రెండు పదవుల ఎన్నిక నిర్వహించారు.
సభలో సభ్యులు చెతులెత్తి విజయ లక్ష్మికి మద్దతు ప్రకటించారు. కాగా డిప్యూటీ మేయర్‌గా తార్నాక కార్పొరేటర్ మోతే శ్రీలత రెడ్డి ఎన్నికయ్యారు.
మేయర్‌గా విజయలక్ష్మి పేరును కార్పొరేటర్ బాబాఫసీయుద్దీన్, గాజులరామారం కార్పొరేటర్ ప్రతిపాదించారు.
ఎంఐఎం మద్దతివ్వడంతో మేయర్, డిప్యూటి మేయర్ పదవులను ఎక్స్ అఫీషియో ఓట్లు అవసరం లేకుండానే టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.