దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగుతోంది. జనవరి 16న దేశవ్యాప్తంగా ప్రారంభమయిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది.
దేశవ్యాప్తంగా ఉన్న 63 లక్షల మంది ఫ్రంట్ లైన్ యోధులకు ఇచ్చే ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. వీరికి అవసరమైన రెండో డోస్ కూడా సిద్ధం అయింది.
ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో కోటీ 45 లక్షల టీకా డోస్ లకు ఆర్డర్ ఇచ్చింది. ఆక్స్ ఫర్డ్ – ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కొవిషీల్డ్ కోటి డోస్ లు, భారత్ బయోటెక్ కు చెందిన కొవాగ్జిన్ 45 లక్షల డోస్ లకు ఆర్డర్ ఇచ్చామని ఔషధ నియంత్రణ సంస్థ తెలిపింది.
ఆగస్టు నాటికి 30 కోట్ల మందికి రెండు డోస్ ల వ్యాక్సిన్ ఇచ్చేందుకు కట్టుబడివున్నామని పేర్కొంది.
మార్చి నాటికి వయో వృద్ధులకు టీకా ఇవ్వడం ప్రారంభమవుతోందని అధికారులు వెల్లడించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారుగా ఉన్న ఎస్ఐఐ ఇప్పటికే 1.10 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను సరఫరా చేసింది.
ఇక ప్రపంచవ్యాప్తంగాఇప్పటి వరకు 67 దేశాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. ఇంతవరకు 11.90 కోట్ల మంది టీకా తీసుకున్నారు.