హాస్టల్స్ లో సమస్యలను పరిష్కరించండి – ఏబీవీపీ

168
Solve problems in hostels

BC, SC, ST సాంఘీక సంక్షేమ హాస్టళ్లలో ఉన్న సమస్యలను పరిష్కరించి మెరుగైన సదుపాయాలు కల్పించాలని. SC వెల్ఫేర్ కమిషనర్ డా.యోగితా రానా గారికి, ST వెల్ఫేర్ కమిషనర్
డా. క్రిస్టియానా గారికి, అదేవిదంగా BC వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి M.సంధ్య గారికి ఏబీవీపీ ప్రతినిది బృందం కలిసి వినతి పత్రం అందచేయడం జరిగింది.

Solve problems in hostels

ఏబీవీపీ డిమాండ్స్

  • తెలంగాణలోని అన్ని వెల్ఫేర్ హాస్టల్స్ ను వెంటనే పున:ప్రారంభించాలి.
  • ప్రతి హాస్టల్ లో కోవిడ్ నేపధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పూర్తి శానిటైజ్ చేయాలి, నాణ్యమైన ఆహారం అందించాలి, అన్ని హాస్టల్స్ లో ఉన్న టాయిలెట్ లను మరమత్తు చేయాలి. అదేవిదంగా కొత్త టాయిలెట్ లను నిర్మించాలి.
  • నూతనగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కూడా వెంటనే హాస్టల్స్ వసతి కల్పించాలి.
  • SC,ST,BC హాస్టల్స్ కు పక్క భవనాలను నిర్మించాలి.
  • విద్యార్థులు హాస్టల్స్ లో చదువుకునే వాతావరణం కల్పిస్తూ,e- లైబ్రరీలను ఏర్పాటు చేయాలి.
  • హాస్టల్స్ లో సరైన సిబ్బంది లేక హాస్టల్స్ నిర్వహణ ఇబ్బంది కరంగా ఉన్న పరిస్థితి కాబట్టి సిబ్బంది సంఖ్యను పెంచాలి.
  • ప్రతి విద్యార్థికి పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను, కాస్మొటిక్ చార్జీలు పెంచి ఇవ్వాలి.
  • విద్యార్థుల రక్షణ, హెల్త్ విషయం లో ప్రతేకమైన శ్రద్ధ వహించాలి.