తెలంగాణలో పదో తరగతి పరీక్షా పేపర్లను తగ్గిస్తూ విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2020-2021 విద్యాసంవత్సరానికి మొత్తం 11 పరీక్షా పేపర్లను కుదిస్తూ 6 పేపర్లుగా ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్ నేపథ్యంలో డైరక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ ప్రతిపాదనలను అనుసరించి ఈ ఆదేశాలు జారీచేశారు.
ఈ ఆరు పేపర్ల విధానం ఈ విద్యా సంవత్సరానికి(2020-2021) మాత్రమేనని తెలిపారు. నూతన విధానంలో ఫస్ట్ లాంగ్వేజ్, ఇంగ్లీష్, మాథమెటిక్స్, జనరల్ సైన్స్(ఫిజిక్స్&బయాలజీ), సోషల్ స్టడీస్‌కు చెందిన పేపర్ -1, పేపర్-2లు ఒకే పరీక్షా పేపర్‌గా ఉండనున్నాయి. కాగా సెకండ్ లాంగ్వేజ్‌లో ఏ విధమైన మార్పు ఉండదని ఆదేశాల్లో స్పష్టం చేశారు.