పారిశుధ్య కార్మికులకు ఆలయ ఫౌండేషన్ వారి సహాయం

357
Alaya foundation

ఆలయ ఫౌండేషన్ అడ్వర్యంలొ మరియు సహృదయ ఫౌండేషన్ ఆనూహ్యా రెడ్డి గార్ల సౌజన్యం తో ఈ రోజు రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలం ముర్మూర్ గ్రామ పంచాయతీ లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు మరియు సిబ్బందికి కోవిడ్ 19 నియంత్రణ కోసం అనుదినం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలను,కష్టాలను గుర్తించి ఫౌండేషన్ ముఖ్య వాలంటీర్స్ టీట్ల రమేశ్ బాబు, మిట్టపల్లి రాజేందర్, కీర్తీ నాగర్జున గారి ఆధ్వర్యంలో వారికి నిత్యవసర సరుకులు మరియు ఫేస్ మాస్కులు పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కనమల్ల రాకేష్, పంచాయతీ కార్యదర్శి స్రవంతి మాట్లాడుతూ నరహరీ మరియు అనూహ్య రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియచేశారు. అలాగే ఆలయ ఫౌండేషన్ సభ్యులు జూల రాజేష్, మగ్గిడి సాగర్,దాసరి దినేష్ తదితరులు పాల్గొన్నారు.