కరీంనగర్ జిల్లాచొప్పదండి మండలం బిరంరాజయ్యపల్లి గ్రామంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ వచ్చే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఇళ్ల మధ్య ఉన్న గడ్డిని తొలగించాలన్నారు. నీరు నిలువకుండా చూడాలని అన్నారు. నీరు నిలిస్తే దోమలకు స్థావరంలా ఏర్పడి దోమలు పెరిగే అవకాశం ఉంటుందని వాటి ద్వారా విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉంటుందని అన్నారు. కాబట్టి ప్రజలకు ప్రజా ప్రతినిధులు, అధికారులు అవగాహన కల్పించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఏనుగు రవిందర్ రెడ్డి ,జడ్పీటీసీ మాచర్ల సౌజన్య-వినయ్ కుమార్,సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, రగంపేట్ సర్పంచ్ మామిడి లత-రాజేశం, trs మండల అధ్యక్షులు బంధారపు అజాయ్ కుమార్, RI సంతోష్,RWS,AE సంధ్యా, పలువురు trs నాయకులు ,అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
గంగాధర మండలం ఆచంపల్లి గ్రామంలో రేషన్ కార్డు లేని పేదలకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బియ్యం పంపిణీ చేశారు.తరువాత గ్రామంలో ఎల్లమ్మ గుండి దగ్గర నూతనంగా నిర్మించిన బోరు బావిని ప్రారంభించినారు.