అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన దలైలామా

241

ప్రముఖ బౌద్ధ ధర్మ గురువు దలైలామా ఇంటర్నెట్‌ వేదికగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజుల క్రితం బీబీసీకిచ్చిన ఇంటర్వ్యూలో దలైలామా మహిళల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.దలైలామా వ్యాఖ్యల పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ మహిళ మీ వారసురాలు కావడం మీకు అంగీకారమేనా అని విలేకరి అడిగిన ప్రశ్నకు దలైలామా సమాధానమిస్తూ.. మహిళా దలైలామా వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే ఆమె తనలా కాకుండా చాలా అందంగా ఉండాలన్నారు. అలా అయితేనే జనాలు ఆమెను చూడ్డానికి ఉత్సాహం చూపిస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దలైలామా.

ఆయన వ్యాఖ్యలు పితృస్వామ్య వ్యవస్థకు అద్దం పడుతున్నాయంటూ నెజటిన్లు మండిపడుతున్నారు. అందంగా ఉంటేనే ఎక్కువ ఆధ్యాత్మికత ఉన్నాట్లా అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో స్త్రీపురుషులిద్దరికీ బౌద్ధమతంలో సమాన హక్కులు ఉంటాయని చెప్పిన దలైలామా ఇప్పుడిలా మాట్లాడటం తగదన్నారు.