దర్శకుడు కోడి రామకృష్ణ మృతి

335

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. గతకొంత కాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మ‌ధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. కోడి రామకృష్ణ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో కెరీర్ ప్రారంభించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. వంద చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు.




 

ప్రముఖ దర్శక-నిర్మాత, దివంగత దాసరి నారాయణరావు.. రామకృష్ణను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. సినీ రంగంలో రామకృష్ణది 30ఏండ్ల సుధీర్ఘ ప్రస్థానం. ఆయన తీసిన తొలి చిత్రమే 525 రోజులు ఆడింది. అత్యధికంగా గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్‌లతో విజయవంతమైన చిత్రాలు తీశారు. ఎక్కువగా గ్రామీణ, కుటుంబ, మహిళా నేపథ్యంలో సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చారు. శత్రువు చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు దక్కింది.

చిత్రాలు..:
మంగమ్మగారి మనవడు, ఆహుతి, శత్రువు, అమ్మోరు, అరుంధతి, తలంబ్రాలు, భారతంలో బాలచంద్రుడు, స్టేషన్ మాస్టర్, ముద్దుల మావయ్య, మా ఆవిడ కలెక్టర్, పెళ్లి, దొంగాట, అంజి, దేవిపుత్రుడు, దేవి, దేవుళ్లు, పంజరం, పెళ్లాం చెబితే వినాలి, భారతరత్న, మువ్వగోపాలుడు, లేడీ బాస్, శ్రీనివాస కల్యాణం, అంకుశం, రాజధాని, పుట్టింటికి రా చెల్లి వంటి హిట్ చిత్రాలు తీశారు.



అవార్డులు..:
10 నంది అవార్డులు,
2 ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు
2012లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నారు.