ఉదారత చాటుకున్న పటాన్చెరు ఎమ్మెల్యే

258
Patancheru MLA

లక్ష్మీపతి గూడెం గ్రామపంచాయతీ భవనం స్థలం కోసం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఒక లక్ష యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.

నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటైన గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

జిన్నారం మండల పరిధిలోని లక్ష్మీపతిగూడెం నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మించేందుకు ఎంపిక చేసిన స్థలం కొనుగోలు కోసం ఎమ్మెల్యే జిఎంఆర్ 1,50,000 రూపాయల సొంత నిధులను అందించారు.

గురువారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థలం యజమానులకు డబ్బులు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన గ్రామపంచాయతీల భవనాల నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించడంతోపాటు, అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.

గతంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా 40 గ్రామ పంచాయతీలకు సొంత నిధులతో ట్యాంకర్లు, ట్రాక్టర్లు, ట్రాలీలు అందించడం జరిగిందని గుర్తు చేశారు. దీంతోపాటు వివిధ గ్రామాలలో సిసి రోడ్లు సైతం వేయించడం జరిగిందని పేర్కొన్నారు.