పట్టాలెక్కనున్న మరో 22 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు!

266
22 more express trains to be counted!

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా రద్దు చేసిన రైళ్లలో మరికొన్ని త్వరలో పట్టాలెక్కబోతున్నాయి.

మరో 22 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పునరుద్ధరించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే నిన్న తెలిపింది.

ఇందులో సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, ఔరంగాబాద్, రేణిగుంట నుంచి రాకపోకలు సాగించే రైళ్లు ఉన్నాయి.

ఇందులో భాగంగా ఎస్‌సీఆర్‌ ఆధ్వర్యంలో మొత్తం 300 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఉండగా, ఇప్పటికే 180 రైళ్లు నడుస్తున్నాయి.

వీటికి అదనంగా మరో 22 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా పునరుద్ధరించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.

వీటిలో ఎక్కువ శాతం ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. మిగిలినవి తొలి వారంలో అందుబాటులోకి వస్తాయి.

కొత్తగా అందుబాటులోకి రానున్న రైళ్లలో 8 డైలీ సర్వీసులు కాగా, వారానికి మూడు రోజులు నడిచేవి రెండు ఉన్నాయి. మిగిలిన 12 రైళ్లు వారానికి ఒకసారి మాత్రమే నడుస్తాయి.

రైలు ప్రయాణికులకు స్టేషన్‌లో కౌంటర్ టికెట్‌ తీసుకొనే సౌకర్యం మాత్రం లేదు.

కనీసం 4 గంటల ముందుగానే టికెట్‌ బుక్‌ చేసుకోవాలి. మూడు నెలల ముందు నుంచే రిజర్వేషన్‌కు అవకాశం ఉన్నది.

ఈ క్రమంలో అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో బెర్తులు, ఏసీ టైర్లు, ఫస్ట్‌క్లాస్‌, సెకండ్‌ క్లాస్‌ సదుపాయాలతోపాటు సాధారణ టికెట్‌కు కూడా తప్పకుండా రిజర్వేషన్‌ చేయించుకోవాలి.

జనరల్‌ టికెట్‌ కూడా రిజర్వేషన్‌ ఉండటంతో సాధారణ టికెట్‌ ధరపై రూ.15 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.