త్వరలో రోడ్డెక్కనున్న డబుల్‌ డెక్కర్‌ బస్సులు!

440
Double-Decker Bus

హైదరాబాద్‌ నగరంలో కనుమరుగైన డబుల్‌ డెక్కర్‌ బస్సులు త్వరలో రోడ్డెక్కనున్నాయి. డెక్కర్‌ బస్సులను పునరుద్ధరించడంపై టీ ఎస్ ఆర్టీసీ దృష్టి సారించింది. మరో రెండు నెలల్లో బస్సులు సిటీ రోడ్లపై తిరగనున్నాయి.

ప్రయోగాత్మకంగా 25 బస్సులు తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది. బ‌స్సుల కొనుగోలుకు తెలంగాణ ఆర్టీసీ టెండ‌ర్లు ఆహ్వానించింది. బుధవారం ఈ నెల 11వ తేదీ వ‌ర‌కు టెండ‌రు ప‌త్రాల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని ఆర్టీసీ పేర్కొంది.

ఈనెల 18న ప్రీ బిడ్‌ సమావేశాన్ని నిర్వహించి, బస్సులు ఎలా ఉండాలన్న విషయంలో ఆ సమావేశంలో తయారీదారులకు స్పష్టం చేయనుంది.

రూట్‌ నెం.229 (సికింద్రాబాద్‌ – మేడ్చల్‌ వయా సుచిత్ర)
రూట్‌ నెం.219 (సికింద్రాబాద్‌–పటాన్‌చెరు వయా బాలానగర్‌ క్రాస్‌ రోడ్డు)
రూట్‌ నెం. 218 (కోఠి–పటాన్‌చెరు వయా అమీర్‌పేట)
రూట్‌ నెం.9ఎక్స్‌ (సీబీఎస్‌–జీడిమెట్ల వయా అమీర్‌పేట)

మార్గాల్లో ఈ బస్సులు తిరగనున్నాయి.