ప్రతి రోజూ ఇంటింటి చెత్త సేకరణ చేయాలి: మంత్రి హరీష్‌రావు

354
harish-rao-gives-clarity-his-party-changing

ప్రతి రోజూ ఇంటింటి చెత్త సేకరణ చేయాలని తెలంగాణ మంత్రి హరీష్‌రావు అధికారులకు సూచించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా బుస్సాపూర్ రిసోర్స్ పార్కులో  తడి, పొడి వ్యర్థాల ఏర్పాటు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడి, పొడి చెత్తను వేర్వేరు చేయాలన్నారు. డీఆర్సీ సెంటర్ వారికి పూర్తి బాధ్యతలు అప్పగించాలని సూచనలు చేశారు. డంప్ యార్డులో చెత్త నిల్వ ఉంచొద్దని ఆయన అన్నారు.

బయోగ్యాస్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభించాలని, ఈ విషయాన్ని గ్యాస్ సంబంధిత ఏజెన్సీలతో చర్చించాలని మున్సిపల్ అధికారులకు మంత్రి సూచించారు. పొడి వ్యర్థ వనరుల కేంద్రాన్ని సందర్శించి పొడి చెత్త సేకరించడంపై మంత్రి ఆరా తీశారు. చెత్త సేకరణ వాహనాలు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు మున్సిపల్ కమిషనర్ సెల్ ఫోన్ కు అనుసంధానం చేయాలని మంత్రి ఆదేశించారు. సీసీ కెమెరాల ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.