జురాసిక్ సీరిస్ లను ఇష్టపడే సినీ ప్రేమికులను అలరించేందుకు మరో ఉత్కంఠభరిత చిత్రం సిద్ధమైపోయింది. 2015లో విడుదలైన జురాసిక్ వరల్డ్ కు కొనసాగింపుగా రూపొందించిన జురాసిక్ వరల్డ్ – ఫాలెన్ కింగ్ డమ్ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ చూస్తే సినిమా అంచనాలు మరిన్ని పెరుగుతాయి. ఇందులో అగ్నిపర్వతం బద్దలవుతున్న సన్నివేశాలు.. డైనోసార్లతో పోరాటాలు చూస్తే ఒళ్లుగగూర్పాటు కలుగుతుంది. త్రీడీ వెర్షన్ లో కూడా విడుదల కానున్న ఈ సినిమా జూన్, 2018న ప్రేక్షకుల ముందుకు రానుంది.
జురాసిక్ వరల్డ్ – ఫాలెన్ కింగ్ డమ్ ట్రైలర్