ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను ఈ నెల 12, లేదా 13న విడుదల చేసేందుకు ఇంటర్‌బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంటర్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 9.60 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ నెల 15, 16 తేదీల్లో జేఈఈ మెయిన్ ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అంతకంటే ముందుగానే ఇంటర్ ఫలితాలను విడుదలచేసే అవకాశాలను బోర్డు అధికారులు పరిశీలిస్తున్నారు.
ఏపీలో ఈ నెల 12న ఇంటర్ ద్వితీయ సంవత్సరం, 13న మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల కానున్నాయి.