చాయ్ ప్రియులకు శుభవార్త.. 800 టీ రుచులు.. దేశంలోనే తొలి ‘ది టీ రూమ్‌’ బంజారాహిల్స్‌లో ఏర్పాటు

245
tea room

‘‘అల్లం టీ అంటే అది పెంచును ఆరోగ్యం.. మసాలా టీ అంటే అది దించునురా మైకం.. లెమన్‌ టీ కొడితే ఇక లేజీ మటుమాయం.. ఇరానీ టీ పడితే ఇటు రాదా ఆ స్వర్గం’’ అని ఛాయ్‌లో రకాలు వాటి ప్రయోజనాలను గురించి గొంతు విప్పి మరీ పాడాడు అగ్ర కథానాయకుడు చిరంజీవి. నిజమే! రుచిలో వేటికవే సాటి. ఇక భాగ్య నగరవాసులుకు ఛాయ్‌ అంటే ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. అందుకే సింగపూర్‌కి చెందిన టీడబ్ల్యూజీ అనే సంస్థ దేశంలోనే మొట్టమొదటి సారిగా ‘ది టీ రూమ్‌’ను ఏర్పాటు చేసింది. భాగ్యనగరంలోని బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన ఈ టీ రూమ్‌లో ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 800 రకాల టీ రుచులను ఆస్వాదించవచ్చు. కుటుంబ సమేతంగా కలిసి టీ తాగి ఎంచక్కా భోజనం కూడా చేసి రావచ్చు. రూ.600 నుంచి రూ.6,000 వరకు విలువ గల తేనీరు ఇక్కడ లభ్యమవుతుందని నిర్వాహకులు తెలిపారు.